Thursday, April 14, 2022

అన్నమయ్య జిల్లా ఇంజినీరింగ్ కళాశాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో అడహక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఈ నియామకాలు రిజర్వేషన్ కేటగిరీలో డిపార్ట్ మెంట్ పరంగా ఉంటాయన్నారు. అనంతపురం జేఎన్ టీయూ లో ఈ నెల 20, 21న ఇంటర్వూలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు www.jntuacek.ac.in లో చూడొచ్చన్నారు. ఈ నెల 18 దరఖాస్తులకు చివరి తేదీ అని తెలిపారు.

0 comments

Post a Comment

Thank You for your comment