Saturday, November 27, 2021

కడప జిల్లాలో అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు

 వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి కార్యకర్త పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవాలని బద్వేల్ ఏరియా ఐ సి డి సి ప్రాజెక్టు అధికారి సునంద తెలియజేశారు.

 బ్రహ్మంగారిమఠం మండలంలోని ఎద్దులాయపల్లి, చౌదరి వారి పల్లె, కమ్మవారిపల్లె అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హత కలిగిన వారు డిసెంబర్ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. వివరాలకు ఐ సి డి సి ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలియజేశారు.


0 comments

Post a Comment

Thank You for your comment