Friday, June 12, 2020

కడప ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు

కడప జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆన్లైన్లో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఈవో దీప్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినూత్న ఫర్టిలైజర్ కంపెనీలో సేల్స్ సూపర్ వైజర్లుగా పనిచేసేందుకు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆ మేరకు పదో తరగతి ఆపై విద్యార్హతలు కల్గిన వారు ఈ నెల 12, 13 తేదీల్లో తమ పేర్లను de.kadpa@gmail.com నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం 15వ తేదీన ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారికి రూ.8 వేల జీతం ప్రతినెలా చెల్లిస్తారని ఆమె స్పష్టం చేశారు.

జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజరు సంపత్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐ, డిప్లమో విద్యార్హత కల్గినవారు, డ్రైవర్లు ఈ ఉద్యోగాలకు అర్హులని, ఆసక్తి కల్గిన నిరుద్యోగులు 18004252422 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు.

0 comments

Post a Comment

Thank You for your comment